సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పాయల్ రాజ్ పుత్ కల నెరవేరిందట!
- అఖిల్ సినిమా కోసం రష్మిక?
- సాయితేజ్ సినిమా పూర్తయింది
* అందాలతార పాయల్ రాజ్ పుత్ తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతున్న 'నరేంద్ర' అనే సినిమాలో ఈ చిన్నది కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించిన డబ్బింగును తాజాగా పూర్తిచేస్తూ, 'తెలుగులో డబ్బింగ్ చెప్పాలనేది నా కోరిక, అది ఈ సినిమాతో నెరవేరింది' అంటూ పాయల్ పోస్ట్ పెట్టింది.
* అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక నటించే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
* సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం షూటింగ్ ముగిసింది. ఇటీవల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలతో మొత్తం పూర్తయిందని యూనిట్ తెలిపింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటించింది.