కిమ్ జాంగ్ ఉన్ గురించి ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన ట్రంప్
- 2013లో తన అంకుల్ నే చంపేసిన కిమ్
- దేశద్రోహ నేరం కింద మరణశిక్ష అమలు
- తల లేని మొండేన్ని కిమ్ అధికారులకు ప్రదర్శించాడన్న ట్రంప్
- ఓ పుస్తకం కోసం ట్రంప్ ఇంటర్వ్యూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తనతో కిమ్ చెప్పిన అనేక విషయాలను ఓ పుస్తక రచయితకు వెల్లడించారు. తల లేకుండా ఉన్న తన అంకుల్ మొండేన్ని ఉత్తర కొరియా సీనియర్ అధికారులకు చూపించినట్టు కిమ్ తనతో చెప్పారని ట్రంప్ వివరించారు.
2013లో కిమ్ తన అంకుల్ జాంగ్ సోంగ్ థైక్ ను అత్యంత దారుణ శిక్షతో హతమార్చాడు. ఆయనపై దేశద్రోహం, అవినీతి ఆరోపణలు మోపిన కిమ్... ఓ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో మరణశిక్ష అమలు చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, "కిమ్ నాకు అన్నీ చెబుతాడు, చెప్పాడు కూడా" అని పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్ వర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'రేజ్' అనే పుస్తకం కోసం వుడ్ వర్డ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. "కిమ్ తన అంకుల్ ను చంపి మెట్లపై పడేశాడు. ఆ మృతదేహానికి తల లేదు" అని ట్రంప్ వివరించారు.