'మారుతి'లో మరిన్ని వాటాలు చేజిక్కించుకున్న సుజుకి మోటార్స్ కార్పొరేషన్

  • మారుతి సుజుకిలో 0.9 శాతం పెరిగిన మాతృసంస్థ వాటా
  • 2,84,322 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసిన సుజుకి కార్ప్
  • డీల్ విలువ రూ.204.31 కోట్లు
దేశీయ మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజంగా పేరుగాంచిన మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తన వాటాలను మరింత పెంచుకుంది. మారుతి సుజుకిలో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తాజాగా 2,84,322 ఈక్విటీలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.204.31 కోట్లు.

ఈ కొనుగోలు డీల్ కు ముందు మారుతి సుజుకిలో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ కు 56.28 శాతం వాటాలు ఉండగా, ఇప్పుడది 0.9 పెరిగి 56.37కి చేరింది. ఈ కొనుగోలు వ్యవహారాన్ని మారుతి సుజుకి బాంబే స్టాక్ ఎక్చేంజి (బీఎస్ఈ)కి నివేదించింది. సుజుకి కార్పొరేషన్ ఈ ఏడాది మార్చిలో 2,11,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దాంతో ఈ జపాన్ దిగ్గజం వాటా 0.7 శాతం పెరిగి 56.28గా నమోదైంది.


More Telugu News