పవన్ పిలుపుకు అపూర్వ స్పందన... రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించిన జనసైనికులు
- ఆలయాలపై దాడుల పట్ల పవన్ ఆవేదన
- దీపాలు వెలిగించాలంటూ పిలుపు
- స్వయంగా దీపం వెలిగించి శ్రీకారం చుట్టిన జనసేనాని
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అంటేనే గొడవ జరిగిందని అర్థం.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పనం కాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని, దానివైపు వేసే తొలి అడుగే ఈ దీపాల ప్రజ్వలనం అని పవన్ పేర్కొన్నారు. ఆయన పిలుపుకు జనసేన కార్యకర్తలు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
పవన్ సైతం తన ఫాంహౌస్ లో ఓ దివ్వె వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ ధ్యానం చేశారు.
ఇక పవన్ పిలుపును పాటిస్తూ విశాఖపట్నం, నందిగామ, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, కైకలూరు తదితర ప్రాంతాల్లో జనసైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు.