మన ధర్మం మన బాధ్యత... అంటూ తల్లి ఫొటో పోస్టు చేసిన రామ్ చరణ్

  • ధర్మాన్ని పరిరక్షిద్దాం అంటూ పవన్ పిలుపు
  • పరమత సహనానికి తనదైన భాష్యం
  • భారతీయ సంస్కృతి కూడా విలువైనదేనంటూ చెర్రీ ట్వీట్
ధర్మాన్ని పరిరక్షిద్దాం, మతసామరస్యాన్ని కాపాడుదాం అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాత ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా మతాలను సహనంగా చూడడమే పరమత సహనం అని భాష్యం చెప్పారు. ఈ నేపథ్యంలో మెగా హీరో రామ్ చరణ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు చేశారు.

మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తల్లి సురేఖ ఫొటోను కూడా పంచుకున్నారు. హిందూ సంప్రదాయంలో ఎంతో  విశిష్టత ఉన్న తులసి చెట్టుకు సురేఖ పూజ చేస్తుండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. భారతీయ సంస్కృతి కూడా విలువైనదే (భారతీయ కల్చర్ మ్యాటర్స్) అంటూ చెర్రీ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. మొత్తమ్మీద బాబాయ్ భావజాలాన్ని అబ్బాయ్ కూడా అనుసరిస్తున్నట్టు అర్థమవుతోంది.


More Telugu News