ఎమర్జింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ విభాగంలో ఏపీకి నెంబర్ వన్ ర్యాంకు

  • స్టార్టప్ ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్
  • ఔత్సాహిక నాయకుల విభాగంలో తెలంగాణకు స్థానం
  • బెస్ట్ పెర్ఫార్మర్ గా గుజరాత్
కేంద్రం ప్రకటించిన స్టార్టప్ ర్యాంకింగ్స్ 2019లో ఆంధ్రప్రదేశ్ కు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ కేటగిరీలో నెంబర్ వన్ ర్యాంకు లభించింది. తాజాగా కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్టార్టప్ ఇండియా ర్యాంకులు విడుదల చేశారు. ఎమర్జింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ర్యాంకింగ్స్ లో ఏపీ తర్వాత చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, తమిళనాడు, అసోం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, సిక్కిం, యూపీ ఉన్నాయి.

ఇక తెలంగాణకు స్టార్టప్ ఔత్సాహిక నాయకుల విభాగంలో స్థానం లభించింది. ఈ జాబితాలో హర్యానా ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఈ పట్టికలో నాగాలాండ్  ఝార్ఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. ఇటీవలే ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ కు కొనసాగింపుగా ఈ స్టార్టప్ ర్యాంకింగులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక, స్టార్టప్ బెస్ట్ పెర్ఫార్మర్ గా గుజరాత్ కు స్థానం లభించింది.


More Telugu News