కేంద్ర ప్రభుత్వ నోటీసులను చించేసిన ఆప్.. బీజేపీ ఫైర్!

  • మురికివాడలను ఖాళీ చేయించాలని కేంద్రం నోటీసులు
  • కేజ్రీవాల్ బతికుండగా ఆ పని జరగదన్న రాఘవ్ చందా
  • పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయిస్తామని వ్యాఖ్య
ఢిల్లీ రైల్వే ట్రాక్ వెంబడి మురికివాడల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చందా చించేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ నోటీసులపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బతికున్నంత కాలం మురికివాడల్లోని ప్రజలను ఖాళీ చేయించడం ఎవరి తరం కాదని అన్నారు. వారందరికీ సరైన పునరావాసాన్ని కల్పించిన తర్వాతే అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామని చెప్పారు. దీని కార్యాచరణకు సంబంధించి ఒక ప్రణాళికను  సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు నోటీసులను ఆప్ నేత చించేయడంపై బీజేపీ ఫైర్ అయింది. కేంద్ర నోటీసులను చించేయడం క్షమించరాని నేరమని మండిపడింది. మురికివాడలను ఖాళీ చేయించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది.


More Telugu News