ఏఆర్ రెహమాన్ కు నోటీసులిచ్చిన మద్రాస్ హైకోర్టు

  • పన్ను ఎగ్గొట్టారంటూ రెహమాన్ పై ఐటీ శాఖ ఆరోపణలు
  • ట్రస్టు ఖాతాలోకి నగదును వేయించుకున్న రెహమాన్
  • రూ. 3.47 కోట్లకు సంబంధించి కేసు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. యూకేకు చెందిన సంస్థ నుంచి పొందిన రూ. 3.47 కోట్ల రెమ్యునరేషన్ కు సంబంధించి ఆదాయపుపన్ను శాఖకు ట్యాక్స్ ఎగ్గొట్టారనే కేసులో ఆయనకు నోటీసులు అందాయి.

తన ఖాతాలోకి కాకుండా, తన ఛారిటబుల్ ట్రస్టు ఖాతాలోకి రెమ్యునరేషన్ వేయాలని బ్రిటీష్ కంపెనీని రెహమాన్ కోరారని... దాంతో, వారు ట్రస్టు ఖాతాలోకి నగదును జమ చేశారని ఐటీశాఖ ఆరోపించింది. తద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో రెహమాన్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.


More Telugu News