పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ఇండియా!

  • ఇండియా, అమెరికాల మధ్య జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
  • ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ఇండియా
  • ఇండియాకు మద్దతు పలికిన అమెరికా
ఐక్యరాజ్యసమితిలో ఎన్నోసార్లు పరువుపోయినా, ప్రపంచ దేశాలన్నీ దోషిగా చూస్తున్నా పాకిస్థాన్ వంకర బుద్ది మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే... మరోవైపు  దొడ్డిదారిన వారికి సహాయసహకారాలు అందిస్తూనే ఉంది. మరోవైపు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాక్ ను భారత్ ఎన్నోసార్లు కోరింది. అమెరికా సైతం ఇదే విషయానికి సంబంధించి పాక్ ను హెచ్చరించింది. అయినా, పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.

తాజాగా ఇండియా-అమెరికా మధ్య యూఎస్ కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్థాన్ కు భారత్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఈ భేటీ తర్వాత ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనపై జాయింట్ స్టేట్మెంట్ ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అమెరికా సంపూర్ణ మద్దతును ప్రకటించింది.


More Telugu News