ఏపీలో హిందూ దేవాలయాలపై ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దీక్ష
- మతి స్థిమితం లేని వారిపై అభాండాలా?
- వారు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారా?
- వెల్లంపల్లి మతిలేకుండా మాట్లాడుతున్నారు
- ప్రజల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి
మతి స్థిమితం లేని వారు కేవలం హిందూ దేవాలయాలను, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారా? అంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు నిలదీశారు. దేవాలయాలపై జరుగుతోన్న దాడులపై సర్కారు చెబుతున్న సమాధానం సరికాదని మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలోని తన నివాసంలో గాంధేయ పద్ధతిలో ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆయన హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన చెప్పారు.
వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్పారు. వారి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై చర్యలు తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.