మతతత్వం, మూఢభక్తి ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి!: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది
  • ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి
  • మతతత్వం, మూఢభక్తి భయానకమైన‌వి 
  • మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజిది 
మతాల గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాని కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌రిత్ర‌లో ఎన్నో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పుకొచ్చారు. ‌

'పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు. సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా  మతాలని సహనంగా చూడటం' అని పేర్కొన్నారు.
 
'1893, సెప్టెంబరు 11... స్వామి వివేకానంద వారు షికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మతసామరస్యాన్ని కాపాడుకుందాం’ అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం. అంతా దైవ సంకల్పం' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.  

'మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది' అంటూ స్వామి వివేకానంద చెప్పిన వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో గుర్తు చేశారు.


More Telugu News