కరోనా రోగుల్లో దీర్ఘకాలంపాటు సమస్యలు.. ఊపిరితిత్తులు, గుండెకు ముప్పు!
- ఆస్ట్రియాలోని 86 మంది రోగులపై అధ్యయనం
- ఆరోవారంలో 88 శాతం వరకు క్షీణించిన ఊపిరితిత్తుల సామర్థ్యం
- అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో సగం మందికి పొగ తాగే అలవాటు
కరోనా నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలంపాటు సమస్యలు వేధించే అవకాశం ఉందని యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కొందరిలో ఈ సమస్య కొంతకాలం తర్వాత తగ్గిపోతుందన్నారు. ఆస్ట్రియాలోని పలు ఆసుపత్రులలో 86 మంది కరోనా రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
అధ్యయన వివరాలను వర్చువల్ కాంగ్రెస్ సమావేశంలో వివరించారు. రోగులు డిశ్చార్జ్ అయిన అనంతరం 6, 12 వారాల్లో వారి ఊపిరితిత్తులు, గుండె పనితీరుకు సంబంధించి పలు పరీక్షలు నిర్వహించి ఫలితాలను నమోదు చేసినట్టు వివరించారు. ఆరోవారంలో సీటీ స్కాన్ తీయగా వారి ఊపిరితిత్తుల సామర్థ్యం 88 శాతం వరకు క్షీణించిందని, 12వ వారంలో అది 56 శాతానికి తగ్గిందని విశ్లేషించారు.
అయితే, ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసిన వారిలో సగం మందికి పొగ తాగే అలవాటు ఉందని, 65 శాతం మంది ఊబకాయులని అధ్యయనకారులు తెలిపారు. అయితే, ఎటువంటి వ్యసనాలు లేని వారికి ఈ ముప్పు ఎంతవరకు ఉంటుందన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.