శ్రీశైలానికి భారీ వరద... మళ్లీ గేట్ల ఎత్తివేత!

  • మరోసారి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
  • శ్రీశైలం జలాశయానికి 1.98 లక్షల క్యూసెక్కుల వరద
  • నాలుగు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తిన అధికారులు
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది మరోసారి పరవళ్లు తొక్కుతోంది. నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోవడం, మరింత వరద వస్తుండటంతో, ఈ ఉదయం శ్రీశైలం వద్ద 1.98 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. జలాశయం నుంచి అన్ని కాలువలకూ, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్న అధికారులు, డ్యామ్ నాలుగు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి, 1.60 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. సాగర్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో, నేటి సాయంత్రం సాగర్ గేట్లను కూడా ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


More Telugu News