బ్లాక్ చేసిన సీట్లలో పక్కపక్కనే తెలంగాణ మంత్రులు... సున్నితంగా మందలించిన స్పీకర్!

  • అసెంబ్లీలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు
  • ఈటల పక్కన కూర్చున్న జగదీశ్ రెడ్డి
  • వద్దని హెచ్చరించిన పోచారం
కరోనా వైరస్ కారణంగా అసెంబ్లీలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన వేళ, నిబంధనలను పాటించని మంత్రులను స్పీకర్ పోచారం సున్నితంగా మందలించారు.

ఆ విషయంలోకి వెళితే, తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల మధ్య కొన్ని సీట్లను నో సీటింగ్ జోన్ లుగా ప్రకటించారు. అయితే, సభ జరుగుతున్న వేళ, మంత్రి ఈటల రాజేందర్ పక్కనే ఉన్న నో సీటింగ్ ప్రాంతంలో మరో మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లి కూర్చున్నారు. దీన్ని గమనించిన పోచారం, ఆ సీట్లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. నో సీటింగ్ సీట్ లో కూర్చోవద్దని హెచ్చరించారు. దీంతో అప్పటివరకూ ఈటల పక్కనే ఉన్న జగదీశ్ రెడ్డి, అక్కడి నుంచి లేచి తన స్థానంలోకి వెళ్లిపోయారు.


More Telugu News