టీటీడీ బంపరాఫర్... కల్యాణం చేయిస్తే, మూడు నెలల్లో ఎప్పుడైనా సుపథం ద్వారా స్వామి దర్శనం!
- క్రమంగా దర్శనాలను పెంచుతున్న టీటీడీ
- ఇప్పటికే 8,330 మందికి ఆన్ లైన్ కల్యాణోత్సవ సేవ
- ఉచిత దర్శనం కల్పిస్తామన్న అధికారులు
క్రమంగా తిరుమలలో భక్తుల సంఖ్యను పెంచుతూ ఉన్న టీటీడీ, మరో బంపరాఫర్ ను ప్రకటించింది. ఆన్ లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని ప్రకటించింది. ఇటీవల ఆన్ లైన్ లో కల్యాణోత్సవం సేవను టీటీడీ ప్రారంభించిన తరువాత భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదే సమయంలో తమకు స్వామి దర్శనం కల్పించాలని భక్తులు కోరుతుండటంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 7వ తేదీ వరకూ మొత్తం 8,330 మంది భక్తులు ఆన్ లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. వీరందరికీ ఉత్తరీయం, రవిక, కల్యాణం అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా టీటీడీ పంపుతోంది. ఇకపై కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది.