కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్

  • అవినీతి అంతం కోసమే నూతన చట్టం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
  • పేదల బాధలకు ఇది ముగింపు పలుకుతుందని వెల్లడి
  • గత పాలకులు పరిష్కారం చూపలేకపోయారన్న సీఎం
తెలంగాణలో అవినీత అంతానికి నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ చట్టాన్ని సభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పేదలు ఎంతోకాలంగా అనుభవిస్తున్న బాధలకు ఈ చట్టంతో ముగింపు లభిస్తుందని, ఇది చారిత్రక ఘట్టం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఈ కొత్త చట్టం వర్తిస్తుందని తెలిపారు.

భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించినప్పటి నుంచి భూమికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని, గత పాలకులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవ్య సంస్కరణలతో కూడిన చట్టాన్ని రూపొందించామని వివరించారు.


More Telugu News