2021 నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • ట్రంప్ ను నామినేట్ చేసిన నార్వే పార్లమెంటు సభ్యుడు
  • ప్రపంచ సమస్యల పరిష్కారానికి కృషి చేశారంటూ ప్రశంసలు
  • ఇజ్రాయెల్, యూఏఈ మధ్య ఒప్పందం ట్రంప్ చలవేనని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి పురస్కారం రేసులో నిలిచారు. నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డే 2021 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి ట్రంప్ కృషి చేశారని, వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఎంతో ప్రయత్నించారని జెడ్డే ప్రశంసించారు. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ కృషి అమోఘం అని కొనియాడారు.


More Telugu News