పవన్ తో ఎప్పుడో పనిచేశానంటున్న 'వకీల్ సాబ్' దర్శకుడు!
- పవన్ తో 'వకీల్ సాబ్' చేస్తున్న వేణు శ్రీరాం
- ఇరవై ఏళ్ల క్రితం పవన్ కోలా బ్రాండ్ కి ప్రచారకర్త
- ఆ యాడ్ దర్శకుడికి వేణు శ్రీరాం అసిస్టెంట్
- అభిమానిని కావడం వల్ల నెర్వస్ ఫీలయ్యానన్న వేణు
తాను ఇరవై ఏళ్ల క్రితమే పవన్ కల్యాణ్ తో కలసి పనిచేశానంటున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. ఇంతకుముదు 'ఓ మై ఫ్రెండ్', 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) వంటి చక్కని చిత్రాలను రూపొందించిన వేణు ఇప్పుడు పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ తో కలసి పనిచేసిన అనుభవం తనకు ఎప్పుడో వుందని చెప్పాడు.
"ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఇరవై ఏళ్ల క్రితం పవన్ ఓ కోలా బ్రాండు ఉత్పత్తికి ప్రచారకర్తగా పనిచేశారు. అప్పుడు ఆ సంస్థ తరఫున యాడ్ చిత్రాన్ని తీసిన దర్శకుడికి నేను అసిస్టెంట్ గా పనిచేశాను. ఆ సమయంలో దానికి పవన్ చేత డబ్బింగ్ చెప్పించింది నేనే. ఆయనకు నేను అభిమానిని కావడం వల్ల, ఆ టైంలో కాస్త నెర్వస్ ఫీలయ్యాను. అయితే, ఆయన కంపెనీని మాత్రం ఎంతో ఎంజాయ్ చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు వేణు శ్రీరాం.
ఇక 'వకీల్ సాబ్' చిత్రం విషయానికి వస్తే, లాక్ డౌన్ కి ముందే చాలావరకు షూటింగ్ పూర్తయింది. పవన్ తో కొన్ని రోజుల షూటింగ్ మాత్రం మిగిలివుంది. త్వరలోనే దానిని పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నారు.