మా కుటుంబం పురుగుల మందు వ్యాపారం చేసేది.. అందుకే సినిమాల్లోకొచ్చాను: సుధీర్‌బాబు
- పురుగుల మందు బిజినెస్ లోంచి బయటకు రావాలనుకున్నాను
- కృష్ణ, మహేశ్ సాయం తీసుకోలేదు
- సలహాలు మాత్రమే తీసుకుంటాను
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు తాజాగా నటించిన 'వి' సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు తెలిపాడు. తమ కుటుంబం పురుగుల మందులు తయారు చేసే వ్యాపారం చేసేదని, తాను దాంట్లోంచి పక్కకి రావాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పాడు.
తన మామయ్య కృష్ణ, బావ మహేశ్‌బాబును సాయం చేయాలని తాను ఎన్నడూ అడగలేదని ఆయన చెప్పాడు. అయితే, కెరీర్ పరంగా వారి నుంచి సలహాలు మాత్రమే తీసుకుంటానని తెలిపాడు. తాను ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వారికి చెబుతానని అన్నాడు. చివరికి తన ఆలోచనల ప్రకారమే ప్రాజెక్టుకు ఒప్పుకుంటానని చెప్పాడు.
తనకు నచ్చిన వారితోనే తాను పనిచేస్తుంటానని చెప్పాడు. తన మామయ్య, మహేశ్ ఇచ్చిన సలహాలు పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తానని అన్నాడు. అయితే, ఒక్కోసారి తన నిర్ణయాల వల్ల ప్రతికూల ఫలితాలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయని, అయినప్పటికీ వాటి వల్ల పాఠం నేర్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు.
తనతో సినిమాలు నిర్మించాలని కృష్ణ, మహేశ్ లను తాను ఎన్నడూ అడగలేదని చెప్పాడు. హీరో కాకముందు తాను సినిమాల్ని పంపిణీ చేసేవాడినని, దీంతో సినీ పరిశ్రమపై కాస్త అవగాహన ఉందని చెప్పాడు. ఇక్కడ కొంత మంది స్నేహితులు కూడా ఉన్నారన్నాడు.