అమరావతి సెక్రటేరియట్ లో మరో రెండు ప్రవేశద్వారాల మూసివేత!
- ఇప్పటికే మూడు గేట్ల మూసివేత
- తాజాగా మరో రెండు గేట్లకు శాశ్వత గోడలు
- వాస్తు శాస్త్రం ప్రకారమేనంటున్న అధికారులు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వెలగపూడి ప్రాంతంలో ఉన్న ఏపీ సెక్రటేరియేట్, అసెంబ్లీలకు వెళ్లే దారుల్లో ఇప్పటికే మూడు గేట్లను మూసివేసిన అధికారులు, తాజాగా మరో రెండు గేట్లను కూడా మూసివేశారు. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత, ఈ ప్రాంతంలోని రైతులు నిరసనలకు దిగి, కరోనా, లాక్ డౌన్ కు ముందు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆందోళనలు చేసిన వేళ, అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లే గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే.
వాస్తు శాస్త్రం ప్రకారం సచివాలయం, శాసనసభకు వెళ్లే గేట్లలో కొన్నింటిని తొలగించాలని పండితులు నిర్ణయించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ సంవత్సరం జనవరి 20న అమరావతి రైతులు 'చలో అసెంబ్లీ' నిర్వహించగా, సీఎం బ్లాక్ నంబర్ 1 వరకూ పలువురు రైతులు, మహిళలు రావడం, వారిని అడ్డుకునే మార్గాలు పోలీసులకు తెలియక పోవడంతో, ఆపై ప్రభుత్వం ఒక్కో గేట్ నూ మూసివేస్తూ వచ్చింది.
కాగా, భద్రతా కారణాలు, వాస్తు శాస్త్రం ప్రకారమే గేట్లను మూసివేస్తున్నామని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు అంటున్నారు. తాజాగా సెక్రటేరియట్ గేట్ 1తో పాటు అసెంబ్లీ గేట్ 2 లను శాశ్వతంగా మూసివేస్తూ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, ఇవి రెండూ పూర్తయితే, మొత్తం ఐదు గేట్లు మూతపడినట్లు అవుతుంది.