ఐసీఐసీఐ-వీడియో కాన్ రుణాల కుంభకోణం.. చందాకొచ్చర్ భర్తకు 19 వరకు రిమాండ్

  • వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసే విషయంలో భారీ కుంభకోణం
  • రూ. 1,875 కోట్ల మేర అవినీతి
  • చందాకొచ్చర్ దంపతులతోపాటు వేణుగోపాల్ దూత్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసులు
ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోమవారం దీపక్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ ముంబైలో నిన్న పీఎంఎల్ఏ న్యాయస్థానం ముందు హాజరు పరిచింది. విచారణకు ఆయన సహకరించడం లేదని, కాబట్టి కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణ అనంతరం ఈ నెల 19 వరకు దీపక్‌ను ఈడీ కస్టడీకి తరలించేందుకు అనుమతి ఇచ్చింది.

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేసే విషయంలో రూ. 1,875 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్టు చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌తోపాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ దూత్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ కేసులు నమోదు చేసింది.


More Telugu News