సీతానగరం శిరోముండనం కేసు.. నిందితుల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేసిన హైకోర్టు

సీతానగరం శిరోముండనం కేసు.. నిందితుల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేసిన హైకోర్టు
  • రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం శిరోముండనం కేసు
  • నిందితులుగా వైసీపీ నాయకులు
  • పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడికి నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నాయకులకు ఊరట లభించినట్టయింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ట్రైనీ ఎస్‌ఐ ఫిరోజ్‌షాతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు.


More Telugu News