ఈ ఏడాది దుర్గాపూజ వద్దని నేనెప్పుడూ అనలేదు: మమతా బెనర్జీ
- పశ్చిమ బెంగాల్ లో కరోనా ఉద్ధృతి
- ఓ రాజకీయ పార్టీ వదంతులు వ్యాపింపచేస్తోందని మండిపాటు
- దుష్ప్రచారం నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి
ఈ ఏడాది దుర్గాపూజలు వద్దని తాను అన్నట్టుగా ఓ రాజకీయ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దుర్గాపూజ వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.
దసరా సందర్భంగా కోల్ కతాలో ప్రతి సంవత్సరం నిర్వహించే దుర్గాపూజపై ఇప్పటివరకు తాము నిర్ణయం తీసుకోలేదని మమతా వివరించారు. ఒకవేళ, దుర్గాపూజ వద్దని తాను అన్నట్టు ఎవరైనా నిరూపిస్తే 101 గుంజీలు తీసేందుకు సిద్ధమని అన్నారు. తనపై విపక్షాలు వదంతులు వ్యాపింప చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.