రియా ఓ డ్రగ్స్ బానిసను ప్రేమించింది: న్యాయవాది సతీశ్ వ్యాఖ్యలు
- రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు
- న్యాయం అపహాస్యానికి గురైందన్న న్యాయవాది
- ఒంటరి మహిళను వెంటాడుతున్నారని వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారంలో హీరోయిన్ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మానే షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రియా అరెస్ట్ తో న్యాయం అపహాస్యానికి గురైందని వ్యాఖ్యానించారు.
సుశాంత్ వ్యవహారంలో దాదాపు అన్ని కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణలో పాలుపంచుకుంటున్నాయి. ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు శ్రమిస్తున్నాయి. దీనిపై రియా న్యాయవాది సతీశ్ మానే షిండే స్పందిస్తూ, అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ డ్రగ్స్ కు బానిసైన వ్యక్తిని ప్రేమించిన నేరానికి ఓ ఒంటరి మహిళను మూడు దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.