ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎక్మో, వెంటిలేటర్ చికిత్స కొనసాగిస్తున్నాం: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వెల్లడి

  • ఎస్పీ బాలుకు కొనసాగుతున్న చికిత్స
  • చికిత్సకు స్పందిస్తున్నారన్న ఎంజీఎం ఆసుపత్రి
  • ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
గానగంధర్వుడు, బహుభాషా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వివరించింది. ఇప్పటికీ ఆయనకు ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. మరికొన్నిరోజులకే ఎక్మో సపోర్టును ఏర్పాటు చేశారు. కాగా, నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నందున వెంటిలేటర్ పై చికిత్స మరికొంతకాలం కొనసాగించాల్సి ఉందని తెలిపారు.


More Telugu News