ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • అంతర్వేది అగ్ని ప్రమాదం ఘటనను సీరియస్ గా తీసుకున్నాం
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశాం
ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంచలనం రేపుతోంది. ఈ అగ్నిప్రమాదంలో స్వామివారి రథం దగ్ధం కావడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని... ఆ కుట్రను ఛేదిస్తామని చెప్పారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని... అలసత్వం వహించిన అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశామని, పలువురిని సస్పెండ్ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కాపాడుకుంటామని అన్నారు.


More Telugu News