భారీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 51 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 37 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా పతనమైన టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ లాభాల్లోకి వెళ్లింది. అయితే, ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా టెలికాం, మెటల్, రియాల్టీ, పవర్ తదితర సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 38,365కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 11,317 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.26%), ఇన్ఫోసిస్ (1.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.18%), టీసీఎస్ (0.93%), టెక్ మహీంద్రా (0.72%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-4.13%), భారతి ఎయిర్ టెల్ (-3.36%), యాక్సిస్ బ్యాంక్ (-3.13%), ఓఎన్జీసీ (-2.55%), సన్ ఫార్మా (-2.20%).