'పీవీకి భారతరత్న' తీర్మానం సమయంలో గైర్హాజరైన ఎంఐఎం!

  • తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ
  • పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనన్న అన్ని పార్టీల నేతలు
  • చర్చకు గైర్హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, 'పీవీ తెలంగాణ ఠీవి' అని కొనియాడారు. దేశ ప్రతిష్టను పీవీ ఇనుమడింపజేశారని... పలు సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని చెప్పారు.

మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత కేసీఆర్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు మాట్లాడుతూ భారతరత్నకు పీవీ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు, ఈ తీర్మానంపై జరిగిన చర్చకు ఎంఐఎం దూరంగా ఉండటం గమనార్హం. చర్చకు ఎంఐఎం ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.


More Telugu News