ముంబైలోని హీరోయిన్ కంగన ఆఫీసు గేట్లకు నోటీసులు అంటించిన అధికారులు
- ముంబైలో మణికర్ణిక ఆఫీసు
- ఆ కార్యాలయం వేదికగానే కంగన సినిమాలు
- నిన్న బీఎంసీ అధికారుల దాడులు
- అనుమతి లేకుండా నిర్మాణంలో మార్పులని నోటీసులు
ముంబైపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్ కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు చెందిన అక్కడి పాళి హిల్ బంగ్లాకు మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించడం చర్చనీయాంశమైంది.
ఈ బంగ్లాను మణికర్ణిక ఆఫీసు పేరుతో కంగనా కట్టించుకుంది. ఈ కార్యాలయం వేదికగానే ఆమె సినిమాలు నిర్మిస్తోంది. ముంబైలోని తన కార్యాలయాన్ని అధికారులు కూల్చబోతున్నట్లు కంగనా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిన్న ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బీఎంసీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. బీఎంసీ అధికారులు అందులోకి బలవంతంగా చొరబడ్డారని, అన్ని కొలతలు చూసుకున్నారని కంగనా మరోసారి ఫైర్ అయ్యింది. తన ఆఫీసుకు సంబంధించి అక్రమాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.
అయితే, మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించామని అధికారులు అంటున్నారు.. తమకు ఆ కట్టడంపై వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు.