హీరోయిన్ కంగనకు వై కేటగిరి భద్రతపై ఎంపీ మహువా తీవ్ర విమ‌ర్శ‌లు

  • కంగ‌నా ర‌నౌత్ ఒక‌ బాలీవుడ్ ట్విట్ట‌ర్ యూజర్
  • దేశంలో లక్షమంది జనాభాకు 138 మంది పోలీసులు
  • ఈ జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నాం
  • దేశంలోని వనరులను సక్రమంగా వినియోగించాలి
సినీ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరి భద్రతను కల్పించిన విష‌యం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం, బాలీవుడ్‌లో నెపోటిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్ప‌టికే చాలా మంది సెలబ్రిటీలు అభ్యంత‌రాలు తెలిపారు. ముంబై నగరంపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేయ‌డంతో శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలో ఆమె రేపు ముంబైకి వ‌స్తాన‌ని, ద‌మ్ముంటే ఆపాల‌ని స‌వాలు విసిరింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత క‌ల్పించింది. అయితే, ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. కంగ‌నా ర‌నౌత్ ను ఆమె.. బాలీవుడ్ ట్విట్ట‌ర్ యూజర్ గా అభివ‌ర్ణించారు. దేశంలో లక్షమంది జనాభాకు 138 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.

ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 71 దేశాల్లో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నామ‌ని ఆమె విమ‌ర్శించారు. ఇలాంటి దేశంలో కేవ‌లం ఓ బాలీవుడ్ ట్విట్టర్ యూజర్‌కు అంత భద్రత ఎందుకని అడిగారు. దేశంలోని వనరులను సక్రమంగా వినియోగించడం ఇలాగేనా? అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆమె నిల‌దీశారు.


More Telugu News