నేడు మరింతగా తగ్గిన బంగారం ధర!
- గత వారంలో నాలుగు రోజుల నష్టం
- ఆపై స్వల్ప లాభం, తిరిగి నేడు నష్టం
- రూ. 50,840 వద్ద బంగారం ధర
గత వారంలో నాలుగు రోజుల పాటు నష్టపోయిన బులియన్ మార్కెట్, సోమవారం నాడు కొంత పుంజుకున్నా, తిరిగి నేడు నష్టాల బాటన నడిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో, ఆ ప్రభావం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ పైనా పడింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర చానాళ్ల తరువాత 50 వేల రేంజ్ కి దిగివచ్చింది.
ఈ ఉదయం ఎంసీఎక్స్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 225 నష్టపోయి రూ. 50,840కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర డిసెంబర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో కిలోకు రూ.400కు పైగా పడిపోయి రూ. 67,804కు చేరింది. బంగారం ధర ఓ దశలో రూ. 51,200కు చేరినా, ఆపై రూ. 50,680కి తగ్గిపోయింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం నాడు తొలుత బంగారం, వెండి కొనుగోలుకు కాస్తంత మద్దతు కనిపించినా, సెషన్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పడిపోయి 1,930 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో స్పాట్ మార్కెట్లో అర శాతం నష్టంతో 1,924 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో బులియన్ మార్కెట్లో ధరలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సంగతి తెలిసిందే.