అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు: ఏపీ మంత్రి కొడాలి నాని
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు
- జగన్ సైతం ఈ డిమాండ్ ను పరిశీలిస్తానని చెప్పారు
- మీడియాతో కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై ఇప్పటికే రచ్చ జరుగుతుండగా, అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, రైతులు కొనేందుకు భూమి, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకంటూ, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోనూ చర్చించానని తెలిపారు. అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు.
తన వాదనను విన్న తరువాత, సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తరువాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో వాదించే అర్హత కూడా లేదని అన్నారు.