గ్రామ సర్పంచ్ నలుగురి ముందూ చెప్పుతో కొట్టాడని... యువకుడి బలవన్మరణం!
- జనగామ జిల్లాలో ఘటన
- వీధి లైట్ అడిగినందుకు వాగ్వాదం
- పురుగుల ముందు తాగి యువకుడి ఆత్మహత్య
గ్రామ సర్పంచ్, తనను చెప్పుతో కొట్టాడన్న అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మండల పరిధిలోని కుసుంబాయి తండాలో సర్పంచ్ ధరషావత్ రమేశ్ వీధి లైట్లు వేయిస్తుండగా, తన ఇంటి ముందున్న పోల్ కు కూడా లైట్ వేయాలని గుగులోతు ఎల్లేష్ అనే యువకుడు వచ్చి అడిగాడు. తనను ప్రశ్నించేందుకు నువ్వెవరని సర్పంచ్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది.
ఆపై సర్పంచ్ తీవ్ర ఆగ్రహంతో ఎల్లేష్ ను నలుగురి ముందూ చెప్పు తీసుకుని కొట్టాడు. ఆపై ఇంటికి వెళ్లిన ఎల్లేష్, భార్యకు విషయం చెప్పి ఏడ్చాడు. ఆపై పురుగుల ముందు తాగాడు. దీన్ని గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఎల్లేష్ మరణించగా, సర్పంచ్ పై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ, బంధుమిత్రులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమితో పాటు రూ. 30 వేల నగదును ఇప్పించేలా తండా పెద్దలు పంచాయతీ జరిపి, నచ్చజెప్పారని సమాచారం.