శిరోముండనం ఘటన.. నూతన్ నాయుడిపై మరికొన్ని కేసులు
- ఇప్పటికే 8 కేసులు ఉండడంతో రౌడీషీట్ తెరిచే అవకాశం
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరుతో పలువురికి పోన్లు
- బాధితులు బయటకు వస్తే ఫిర్యాదు చేయించాలని పోలీసుల ఆలోచన
శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడిపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు విశాఖ పోలీసులు రెడీ అవుతున్నారు. నూతన్‌పై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరును దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడిపై పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట స్టేషన్లలో ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. దీంతో అతడిపై రౌడీషీట్ కూడా తెరవాలని భావిస్తున్నారు.
పీవీ రమేశ్ పేరును ఉపయోగించి ఇంకెంతమందిని మోసం చేశాడో అన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అతడి బారినపడి మోసపోయిన వారు బయటకు వస్తే వారితో ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. 82979 87395 నంబరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 మంది అధికారులతో నూతన్ నాయుడు మాట్లాడి ఉంటాడని పోలీసులు గుర్తించారు. అలాగే, పీవీ రమేశ్ పేరును ఏయే పనులకు వాడుకున్నాడో అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు.