అయోధ్యలో ప్రారంభమైన ఆయల నిర్మాణ పనులు.. రెండు భారీ యంత్రాలతో పునాదుల తవ్వకం

  • ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం
  • పనులను పర్యవేక్షిస్తున్న నృపేంద్ర మిశ్రా
  • పనులు ప్రారంభించిన ఎల్ అండ్ టీ
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణంలో తొలి ఘట్టమైన పునాదుల తవ్వకం ఈ రోజు మొదలైంది. భూమిలో వంద అడుగుల మేర పునాదులు తవ్వేందుకు రెండు భారీ యంత్రాలు చేరుకున్నాయి. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మందిర నిర్మాణ సమితి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన లార్సెన్ టూబ్రో (ఎల్ అండ్ టీ) ఇంజినీర్లు పనులు చేపట్టారు. కాగా, ఈ పునాదులను సీబీఆర్, ఐఐటీ చెన్నై నిపుణులు డిజైన్ చేశారు.


More Telugu News