రాజీనామాకు కూడా సిద్ధమే.. కానీ, ఆ పరిస్థితి లేదు: వల్లభనేని వంశీ
- రాష్ట్రానికి జగన్ ఒక్కరే నాయకుడు
- గన్నవరంకు నేనే నాయకుడిని
- అందరినీ కలుపుకుని పోతా
ఇటీవలి కాలంలో టీడీపీ నుంచి దూరంగా జరిగి, వైసీపీకి మద్దతు ఇస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి... స్థానిక వైసీపీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. నియోజకవర్గంలో ముందు నుంచి ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గీయులు వంశీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. నియోజకవర్గంలో వైసీపీ నేత తానేనని దుట్టా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మీడియాతో వంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జగన్ ఒక్కరే నాయకుడని, అదేమాదిరి గన్నవరంకు కూడా తాను ఒకడినే నాయకుడినని చెప్పారు. గన్నవరం నాయకత్వ బాధ్యతలను తాను తీసుకున్నానని తెలిపారు. అందరినీ కలుపుకుని వెళ్తానని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమని... అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.