హీరోయిన్ రియాను అరెస్ట్ చేసే అవకాశం?
- డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రియా
- సుశాంత్ కోసం డగ్స్ కొన్నట్టు అంగీకరించిన సినీనటి
- తాను వినియోగించలేదని చెప్పిన వైనం
బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం తాను డ్రగ్స్ కొన్నట్టు ఆమె అంగీకరించింది. అయితే తాను అతనికి డ్రగ్స్ ఇచ్చానని, తాను మాత్రం వాటిని వినియోగించలేదని చెప్పింది. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారించే క్రమంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.