మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: శివసేన నేత సంజయ్ రౌత్
- శివాజీ, రాణా ప్రతాప్ ల సిద్ధాంతాలను శివసేన పాటిస్తుంది
- మహిళలను గౌరవించడం వారు మాకు నేర్పారు
- మహిళల కోసం మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... హిందూ మతానికి చెందిన ప్రముఖులు ఛత్రపతి శివాజీ, గ్రేట్ మహారాణా ప్రతాప్ ల సిద్ధాంతాలను శివసేన పాటిస్తుందని చెప్పారు. మహిళలను గౌరవించాలనే విషయాన్ని వారు తమకు నేర్పించారని తెలిపారు.
అయితే, మహిళల పట్ల శివసేన దారుణంగా వ్యవహరిస్తోందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. అయితే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని... తమపై ఆరోపణలు చేస్తున్నవారంతా ముంబైని, ముంబాదేవిని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. మహిళల గౌరవం కోసం శివసేన ఎప్పుడూ పోరాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ అధినేత తమకు నేర్పించారని తెలిపారు.