గంజాయిని చ‌ట్టబద్ధం చేయాలి: డ‌్ర‌గ్స్ క‌ల‌క‌లంపై క‌న్న‌డ నటి నివేదిత

  • బాలీవుడ్, శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం
  • క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాగిణి అరెస్టు
  • ఆమెకు స‌పోర్టుగా మాట్లాడిన న‌టి నివేదిత 
  • గంజాయి కూడా తులసి మొక్క‌లాంటిదేన‌ని వ్యాఖ్య‌
బాలీవుడ్, శాండ‌ల్‌వుడ్‌లో ఇటీవల డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో జ‌రుపుతోన్న విచార‌ణ‌లో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌ప‌డ‌డంతో అధికారులు ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మ‌రికొంత మంది పాత్ర కూడా బ‌య‌ట‌ప‌డే అవకాశం ఉంది.

మ‌రోవైపు,  క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో రాగిణి ద్వివేదిని ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఇందులో  కీల‌క స‌మాచారం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ క్రమంలో, ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తూ క‌న్న‌డ న‌టి నివేదిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గంజాయి చాలా మంచిద‌ని ఆమె చెప్పుకొచ్చింది.

గంజాయిని మ‌న‌దేశంలో చ‌ట్టబద్ధం చేయాలని ఆమె వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. గంజాయి తుల‌సి మొక్క‌లాంటిదేన‌ని, దాన్ని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని ఆమె చెప్పింది. అయితే, ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

హిందువులు ప‌విత్రంగా భావించే తుల‌సిని గంజాయితో పోల్చ‌డంపై సోష‌ల్ మీడియాలోనూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. ఆమెకు గంజాయి అల‌వాటు ఉంద‌ని, అందుకే ఆమె ఇటువంటి మాట‌లు మాట్లాడుతోంద‌ని అంటున్నారు.


More Telugu News