విటమిన్ డి లోపంతో కరోనా ముప్పు అధికం: పరిశోధనలో వెల్లడి

  • యూనివర్సిటీ ఆఫ్ షికాగో మెడిసిన్ పరిశోధనలో వెల్లడి
  • కరోనాకు ముందు, ఆ తర్వాత 489 మందిపై పరిశోధన
  • డి విటమిన్ తగిన స్థాయిలో లేకుంటే ప్రమాదమే
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం ఇప్పటికే వివిధ పరిశోధనల్లో వెల్లడి కాగా, దీనిని ధ్రువీకరించేలా మరో అధ్యయన వివరాలు బయటకొచ్చాయి.

రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేయడంతోపాటు ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా శ్వాస వ్యవస్థను కాపాడడంలో విటమిన్ డి  ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో మెడిసిన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సోకడానికి ముందు, ఆ తర్వాత 489 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. విటమిన్ డి తగినంత స్థాయిలో ఉన్న వారితో పోలిస్తే, ఆ విటమిన్ లోపంతో బాధపడుతున్న వారిలో ఎక్కువమంది కరోనాకు గురైనట్టు పరిశోధకులు తేల్చారు.


More Telugu News