నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రజాప్రతినిధులకు జోరుగా కొవిడ్ టెస్టులు
- గత మూడు రోజుల్లో 1602 మందికి కరోనా టెస్టులు
- 19 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
- నిన్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో కొవిడ్ టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తున్నారు.
నిన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, సీతక్కతోపాటు పలువురు అసెంబ్లీ, మీడియా, వివిధ శాఖల సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. గత మూడు రోజుల్లో 59 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎమ్మెల్సీలు సహా మొత్తం 1602 మందికి పరీక్షలు నిర్వహించగా, 19 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారిని 14 రోజులపాటు హోం ఐసోలేషన్, లేదంటే ఆసుపత్రిలో ఉండమని వైద్యులు సూచించారు.