కరోనా వ్యాక్సిన్ రేసులో దూసుకుపోతున్న చైనా సంస్థ

  • వ్యాక్సిన్ రూపొందించిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూపు
  • 50 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్
  • ఆసక్తి చూపిస్తున్న పాకిస్థాన్
ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు శక్తిమంతమైన వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్ బీజీ) అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమైంది. అందుకోసం వివిధ దేశాల్లో సుమారు 50 వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తామని సీఎన్ బీజీ వెల్లడించింది.

ఉజ్బెకిస్థాన్, అర్జెంటీనా, పెరు, బహ్రెయిన్, మొరాకో, యూఏఈ వంటి దేశాల్లో తమ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇందులో 50 వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నట్టు తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఎంతో వేగంగా సాగుతున్నాయని వివరించింది. సెర్బియా, పాకిస్థాన్ దేశాలు కూడా మూడో దశ ప్రయోగాల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని సీఎన్ బీజీ పేర్కొంది.


More Telugu News