రథం దగ్ధం కావడం రాష్ట్రానికే అరిష్టం అంటున్నారు పండితులు: లోకేశ్

  • భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న లోకేశ్
  • దేవాలయాలను రాజకీయంగా వాడుకుంటున్నారంటూ వ్యాఖ్యలు
  • కారకులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం కాలిపోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 60 ఏళ్లుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ఉపయోగిస్తున్న రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైసీపీ పాలనలో లక్ష్మీనరసింహుడి రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని పండితులు అంటున్నారని లోకేశ్ వెల్లడించారు.

ఓవైపు గోశాలలో గోవుల మృత్యుఘోష వినిపిస్తుంటే, మరోవైపు రోజుకొక ఆలయంలో అరిష్ట సంకేతాలు వెలువడుతున్నాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు. రథం దగ్ధం కావడానికి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.


More Telugu News