రియా చక్రవర్తి అరెస్ట్ తప్పదా...? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన న్యాయవాది!
- ఇప్పటికే రియా సోదరుడు అరెస్ట్
- రియా కూడా అరెస్ట్ కు సిద్ధంగా ఉందన్న న్యాయవాది
- రియా అమాయకురాలు కాబట్టే బెయిల్ కోరలేదని వెల్లడి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో ప్రధానంగా డ్రగ్స్ కోణం ఉన్నందున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ ను, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల మిరండాలను అరెస్ట్ చేశారు. దీనిపై రియా తరఫు న్యాయవాది సతీశ్ మానే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రియా అరెస్ట్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. ఓ వ్యక్తిని ప్రేమించినందుకు ఆమెకు ఎదురవుతున్న పర్యవసనాలు ఇవేనని పేర్కొన్నారు. "ప్రేమించడం నేరమా? ఆమె ఓ దుర్మార్గురాలనే భావనలోనే చూస్తున్నారు. రియా అమాయకురాలు కాబట్టే ఆమె ఇంతవరకు ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టును కూడా ఆశ్రయించలేదు. ఆమెపై బీహార్ పోలీసులు కేసులు నమోదు చేశారు... ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఎన్సీబీ కూడా వచ్చాయి" అంటూ వ్యాఖ్యానించారు.