అంతర్వేది క్షేత్రంలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

  • లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం అగ్నికి ఆహుతి
  • రథం కాలిబూడిదవడం బాధాకరమన్న మంత్రి
  • సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడి
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో 60 ఏళ్ల నాటి రథం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. కాగా, రథం దగ్ధమైన ప్రాంతాన్ని ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ రథం దగ్ధం కావడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి పరిశీలించామని వెల్లడించారు. రథం దగ్ధంపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, దీని వెనుక దోషులు ఉన్నారని తెలిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వామివారి కల్యాణోత్సవం నాటికి నూతన రథం నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.


More Telugu News