కరోనా సోకిన అమ్మాయిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడి
- కేరళలో ఘటన
- ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్తోన్న సమయంలో దాడి
- లైంగిక దాడి చేసి ఐసోలేషన్ కేంద్రం వద్ద వదిలిన డ్రైవర్
- పోలీసులకు యువతి ఫిర్యాదు
కరోనా బారినపడిన యువతి(19)ని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో అంబులెన్సును ఆపి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ డ్రైవర్. కేరళలోని పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా లక్షణాలు ఉండడంతో ఓ యువతి క్వారంటైన్లో ఉంది. అక్కడ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరొకరిని వేర్వేరు కరోనా ఐసోలేషన్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సు వచ్చింది.
దాని డ్రైవర్ నౌఫాల్ (25) వారిలో ఓ బాధితురాలని ఓ ఆసుపత్రి వద్ద దించాడు. అంబులెన్సులోని మరో యువతిని మరో ఐసోలేషన్ కేంద్రంలో దించాల్సి ఉంది. ఈ సమయంలోనే మార్గమధ్యంలో అంబులెన్సును ఆపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆమెను ఐసోలేషన్ కేంద్రం వద్ద దించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె శైలజ పోలీసులు, అధికారులను ఆదేశించారు.