ఒడిశాలో ఈ హీరో కూడా సోనుసూద్ లాంటి వాడే!

  • పేద‌ల‌కు ఒడిశా హీరో మిశ్రా సాయం
  • స్మైల్‌ ప్లీజ్  స్వచ్ఛంద సంస్థను న‌డుపుతున్న హీరో
  • లాక్ డౌన్ లో ఒడిశావాసుల‌కు సాయం
లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది సామాన్యుల‌కు సాయం చేసి సినీన‌టుడు సోనుసూద్ అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్న‌ విష‌యం తెలిసిందే.  సోనూసూద్‌ లాగే ఒడిశాలోని  సవ్యసాచి మిశ్రా అనే సినీ హీరో కూడా లాక్‌డౌన్‌లో పేదలకు సాయం చేస్తున్నాడు.

ఆయ‌న గురించి తెలిసిన వారందరూ ఆయ‌ను కూడా సోనుసూద్ అని పిలుస్తున్నారు. ఆయ‌న‌‌ తండ్రి ఓ ఐఏఎస్ అధికారి. ఇతర రాష్ట్రాలు, దుబాయ్‌లో చిక్కుకున్న వందలాది మందిని మిశ్రా సొంత ఖర్చుల‌తో ఒడిశా తీసుకొచ్చాడు. ఆయ‌న‌ స్మైల్‌ ప్లీజ్ అనే స్వచ్ఛంద సంస్థను న‌డుపుతున్నాడు.

త‌న‌ను సాయం అడిగిన ఒడిశావాసులంద‌రికీ ఆయ‌న సాయం చేస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, కేరళ, గుజరాత్‌లలో నిలిచిపోయిన  ఒడిశా విద్యార్థుల కోసం  బస్సులు వేయించి సొంత రాష్ట్రానికి వ‌చ్చేలా చేశాడు. పేద‌ల‌కు ఆహారంతో పాటు వ‌స‌తివంటి ఎన్నో స‌దుపాయాలు క‌ల్పిస్తూ ఆయ‌న రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. 


More Telugu News