వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది: ఎయిమ్స్

  • నిర్దిష్ట రేటులో కొంతకాలంపాటు వైరస్ వ్యాప్తి
  • చాలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి రెండో దశకు
  • కేసులు పెరిగే వేగం తగ్గి క్రమంగా తగ్గుముఖం
కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పేర్కొంది. జనసంచారం మళ్లీ పెరగడంతోపాటు గ్రామాలకు కూడా వైరస్ పాకడం, కరోనా పరీక్షలు పెంచిన కారణంగా వచ్చే ఏడాది కూడా వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని ఎయిమ్ డైరెక్టర్, భారత్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు.

కేసుల వేగం  పెరిగిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించారు. ఒక నిర్దిష్ట రేటులో కొంతకాలం పాటు వైరస్ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి రెండో దశకు చేరిందన్న ఆయన.. వచ్చే ఏడాది కేసులు పెరిగే వేగం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.


More Telugu News