డ్రగ్స్ వ్యవహారంలో సుశాంత్ ప్రియురాలు రియాను విచారించనున్న అధికారులు
- ఇప్పటికే రియా సోదరుడు అరెస్టు
- విచారించిన అధికారులు
- మరికొందరిని విచారించనున్న ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో దర్యాప్తు జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్ వ్యవహారం గురించి తెలిసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు డ్రగ్స్ డీలర్లతో సంప్రదింపులు జరిపాడన్న ఆరోపణలపై నిన్న సుశాంత్ ప్రియురాలు రియా సోదరుడు షోవిక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు.
ఇదే వ్యవహారంపై విచారణకు హాజరుకావాలని రియా చక్రవర్తికి కూడా ఎన్‌సీబీ సమన్లు పంపినట్లు తెలిసింది. ఆమెతో పాటు మరికొందరిని కూడా విచారణకు రమ్మంటున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ అశోక్ జైన్ తెలిపారు. కాగా, ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన షోవిక్ తో పాటు సుశాంత్ మాజీ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరండా ఫోన్లను అధికారులు పరిశీలించగా వారిద్దరు డ్రగ్స్ డీలర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇంతకు ముందు రియా స్మార్ట్ ఫోనును కూడా అధికారులు పరిశీలించారు. ఆమె కూడా డ్రగ్స్ డీలర్లతో చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.