ఒక్క టీచర్ కూడా నా పట్ల అభిమానంగా లేరు : వర్మ

  • టీచర్స్ డే సందర్భంగా వర్మ స్పందన
  • నేను ఒక మంచి టీచర్ ను కూడా కలవలేకపోయాను
  • నా పట్ల కూడా టీచర్లు ఎవరూ సంతోషంగా లేరు
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ట్వీట్లపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'తెలివిగలవారు ఉపాధ్యాయులు కారని నాకు ఎవరో చెప్పారు. టీచర్లు తెలివైనవారే అయితే ఏమీ తెలియని వారితో నిండిన క్లాస్ రూముల్లో కూర్చుని పాఠాలు చెప్పడానికి తమ సమయాన్ని వృథా చేసుకోరు. నేనైతే ఎవరి వద్ద నేర్చుకోను. ఎవరికీ బోధించను. ఇదే నేను నేర్చుకున్న పాఠం' అంటూ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు 'అన్ హ్యాపీ టీచర్స్ డే' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.

చెడు అధ్యాపకుడు ఉండటం వల్లే చెడు విద్యార్థి తయారవుతాడా? అని వర్మ ప్రశ్నించారు. డబ్బు సంపాదనలో సక్సెస్ ఫుల్ అయిన ఎందరో విద్యార్థులు తనకు తెలుసని... కానీ తన జీవితంలో ఒక మంచి టీచర్ ను కూడా కలవలేకపోయానని చెప్పారు. తానొక చెడు విద్యార్థినని... అందుకే తన టీచర్లను ఎవరినీ అభిమానించలేకపోయానని అన్నారు. తన పట్ల తన టీచర్లు ఎవరూ సంతోషంగా లేరని, తాను కూడా వారి పట్ల సంతోషంగా లేనని ముక్తాయించారు. 


More Telugu News